ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime News: పాపం.. మృత్యువు ఈ రూపంలో వస్తుందని ఆ కుర్రాడు కలలో కూడా ఊహించి ఉండడు.. ప్రేయసిని కలిసేందుకు వెళ్లి..!

ABN, First Publish Date - 2023-08-23T20:53:23+05:30

ఆ యువకుడు చాలా రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.. పక్క పక్క గ్రామాలకు చెందిన ఆ యువతీయువకులు ఎవరికీ తెలియకుండా కలిసి తిరిగేవారు.. అప్పుడప్పుడు ఆ యువకుడు రాత్రి సమయంలో తన ప్రేయసి గ్రామానికి వెళ్లి ఆమెను కలిసేవాడు.. ఈ నెల 20వ తేదీన కూడా అలాగే ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు.. అయితే..

ఆ యువకుడు చాలా రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు (Love Affair).. పక్క పక్క గ్రామాలకు చెందిన ఆ యువతీయువకులు ఎవరికీ తెలియకుండా కలిసి తిరిగేవారు.. అప్పుడప్పుడు ఆ యువకుడు రాత్రి సమయంలో తన ప్రేయసి గ్రామానికి వెళ్లి ఆమెను కలిసేవాడు.. ఈ నెల 20వ తేదీన కూడా అలాగే ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు.. అయితే ఈ సారి ఆ యువకుడికి భయంకర అనుభవం ఎదురైంది.. దీంతో ఆ కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు (Crime News).

ఝార్ఖండ్‌ (Jharkhand)లోని ఛత్రా జిల్లాలోని సలాయా గ్రామంలో ఉంటున్న తన ప్రియురాలిని (Girl Friend) కలిసేందుకు వెళ్లిన కుందన్ కుమార్‌ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కొట్టి చంపారు. ప్రియురాలిని కలిసేందుకు కుందన్‌కు సహకరించిన గోలీ దేవి అనే మహిళను కూడా ప్రజలు దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును బయటపెట్టిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Girls Hostel: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్‌లో తనిఖీలు.. 89 మంది మిస్సింగ్ అని తెలిసి అంతా షాక్.. ఫోన్లు చేసి ఆరా తీస్తే..!

ఆ యువకుడిని కొట్టిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కుందన్ కుమార్ ఈ నెల 20వ తేదీ సాయంత్రం గోలీదేవి అనే మహిళ సహాయంతో ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఇద్దరినీ పట్టుకుని కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టారు. కుందన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గోలీదేవిని చికిత్స నిమిత్తం ఉన్నత కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి దాడిలో పాల్గొన్న మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-08-23T20:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising