ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు కారులో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నారా? అది కూడా లాంగ్ జర్నీలు చేస్తున్నారా? అయితే ఈ ముప్పు తప్పదట!

ABN, First Publish Date - 2023-04-17T07:03:48+05:30

మనిషి దేనిపైన అయినా మోజు పడ్డాడంటే దానిని అంటిపెట్టుకునేందుకు ఇష్టపడుతుంటాడు. ముఖ్యంగా కార్లు అంటే అమితంగా ఇష్టపడేవారు దానిలో తిరుగుతూ, అత్యధిక సమయం దానిలోనే గడుపుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి దేనిపైన అయినా మోజు పడ్డాడంటే దానిని అంటిపెట్టుకునేందుకు ఇష్టపడుతుంటాడు. ముఖ్యంగా కార్లు అంటే అమితంగా ఇష్టపడేవారు దానిలో తిరుగుతూ, అత్యధిక సమయం దానిలోనే గడుపుతుంటారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు(Scientists) హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్లలో అత్యధిక సమయం గడపడం గురించి చైనా, అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు(Investigations) చేయగా.. 12 రోజుల పాటు బయట పార్క్ చేసిన కారులో రసాయనాల స్థాయి సురక్షిత పరిమితిని మించిపోయి క్యాన్సర్‌కు(cancer) కారణమవుతుందని గుర్తించారు. ఇది ఫార్మాల్డిహైడ్ అని పిలిచే ఒక ప్రత్యేక రకం రసాయనం. దీనితో పాటు పార్క్ చేసిన కారులో ఎసిటాల్డిహైడ్(Acetaldehyde) మొత్తం కూడా 61 శాతం వరకు పెరుగుతుంది.

ఇది మనిషి ఆరోగ్యానికి అస్సలు సురక్షితం కాదు. చైనా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్, నకిలీ లెదర్‌తో మీడియం సైజ్ ఎస్‌యూవీని తయారు చేసి ఈ పరిశోధన నిర్వహించారు. ఆ తర్వాత కారును ఇంటి బయట పార్క్ చేశారు. కారు ఉష్ణోగ్రత(temperature) పెరగడం ప్రారంభించడంతో దానిలో రసాయన పరిమాణం కూడా పెరగడాన్ని గమనించారు. ఇటువంటి స్థితిలో కారు... క్యాన్సర్‌కు కారణమని భావిస్తున్న బహుళ అస్థిర కర్బన సమ్మేళనాలను(Multiple volatile organic compounds) విడుదల చేస్తుందని గుర్తించారు.

మరొక అధ్యయనంలో ఒక డ్రైవర్ ప్రతిరోజూ కారులో 11 గంటలు గడుపుతుండగా, ఒక ప్రయాణీకుడు కారులో రోజుకు 1.5 గంటలు గడుపుతున్నట్లు గమనించారు. కారులో గడిపిన సమయంలో హానికరమైన ఈ రసాయనాలు(Chemicals) మనిషి ఊపిరితిత్తులలోకి చేరుతాయి. అవి క్యాన్సర్ ముప్పును మరింతగా పెంచుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-04-17T07:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising