ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YouTube: మొత్తానికి యూట్యూబ్ భలే షాకిచ్చిందిగా.. యాడ్స్ రాకుండా టెక్నిక్స్ వాడే వాళ్లకు..!

ABN, First Publish Date - 2023-11-02T13:31:41+05:30

వరల్డ్‌వైడ్‌గా ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) విస్తృతంగా వినియోగించబడుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ క్రియేటర్, వీక్షకుడిని కనెక్ట్ చేయడం ఈ మాధ్యమం ప్రధాన పని. ప్రస్తుతం భారీ సంఖ్యలో ప్రజలు వీడియోలను చూడటానికి ఇతర వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు.

YouTube: వరల్డ్‌వైడ్‌గా ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) విస్తృతంగా వినియోగించబడుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ క్రియేటర్, వీక్షకుడిని కనెక్ట్ చేయడం ఈ మాధ్యమం ప్రధాన పని. ప్రస్తుతం భారీ సంఖ్యలో ప్రజలు వీడియోలను చూడటానికి ఇతర వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు. ఇక ఈ ప్లాట్‌ఫారమ్‌లో లైఫ్ స్టయిల్, ఎంటర్టైన్మెంట్, విద్య, ప్రయాణం, ఇతర విషయాలకు సంబంధించిన వీడియోలను చూడవచ్చు. అయితే, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో చాలా రకాల యాడ్స్ వస్తుంటాయి. వాటిని కొందరు పలు రకాల టెక్నిక్స్ వాడుతూ బ్లాక్ చేస్తుంటారు. అలాంటి వారికి తాజాగా యూట్యూబ్ భలే షాకిచ్చింది. కంటెంట్ క్రియేటర్లకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాడ్ బ్లాకర్ల ఆటలు కొనసాగకుండా యూట్యూబ్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కంటెంట్ క్రియేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాడ్ బ్లాకర్లను డిసాబుల్ చేయడం లేదా యూట్యూబ్ ప్రీమియర్ (YouTube Premium) ఆప్షన్ కింద నెలకి 14 డాలర్లు (రూ.1165) చెల్లించాలనే షరతు పెట్టింది. యూజర్లు యాడ్స్ ఎనబుల్ చేసుకోవడం లేదా యూట్యూబ్ ప్రీమియర్ సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎంచక్కా యాడ్స్ ఫ్రీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చని చెబుతోంది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కిచెన్ చిమ్నీని ఆర్డర్ ఇచ్చాడో వ్యక్తి.. పార్శిల్ ఇంటికి వచ్చాకా ఓపెన్ చేస్తే కనిపించిన దృశ్యం చూసి..!

ఇక గతకొంత కాలంగా యాడ్ బ్లాకర్స్‌కు ప్లాట్‌ఫారమ్‌పై వీడియోలు ప్లే కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది యూట్యూబ్. దాంతో గడిచిన కొన్ని వారాలుగా ఇలాంటి యూజర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో యూజర్లను యాడ్స్ ఎనబుల్ చేసుకోవడం లేదా యూట్యూబ్ ప్రీమియర్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సంస్థ చెబుతోంది. తద్వారా యూట్యూబ్ మ్యూజిక్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా యూట్యూబ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ యాడ్ బ్లాకర్లు ప్లాట్‌ఫారమ్‌ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడం జరిగిందన్నారు. ప్రకటనలు అనేవి కంటెంట్ క్రియేటర్లకు ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాంటి యాడ్స్‌ను వీడియోల మధ్యలో ప్లే కాకుండా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఆదాయం కోల్పోతున్నారని తెలిపారు.

Viral Video: పరిమితికి మించి జనాలను ఎక్కించుకుంటే ఇలాగే జరుగుతుంది.. ఈ ఆటో పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..!

ఇక ఇటీవలే యూట్యూబ్ మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంపిక చేసిన కొన్ని దేశాలలో అతి తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 'ప్రీమియం లైట్' (Premium Lite) ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 7.39 డాలర్లు (రూ.) ధర ఉన్న 'ప్రీమియం లైట్' ప్లాన్ అనేది యూట్యూబ్‌కు సంబంధించిన వివిధ యాప్స్, ఫార్మాట్‌లలో యాడ్-ఫ్రీ వీక్షణను అందించింది. కానీ, ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ఇతర వాటి యాక్సెస్ ఉండదు.

Viral: మీరెంత తెలివైనవాళ్లో ఈ ఒక్క ఫొటోయే చెప్పేస్తుంది..? ఈ 4 గ్లాసుల్లో దేనిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయో చెప్పగలరా..?

Updated Date - 2023-11-02T13:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising