Zomato: మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై రివేంజ్.. జొమాటోను వాడుకుని ఎలా టార్చర్ చేసిందంటే.. ఫన్నీ మీమ్స్ వైరల్!
ABN, First Publish Date - 2023-08-02T20:49:35+05:30
దేశంలో అత్యంత పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` సోషల్ మీడియా ద్వారా తన వినియోగదారులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సందర్భానికి తగినట్టుగా కరెంట్ టాపిక్స్‌పై ఫన్నీగా స్పందిస్తుంటుంది. ఒక్కోసారి ఫన్నీ ట్వీట్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.
దేశంలో అత్యంత పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` (Zomato) సోషల్ మీడియా ద్వారా తన వినియోగదారులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సందర్భానికి తగినట్టుగా కరెంట్ టాపిక్స్‌పై ఫన్నీగా స్పందిస్తుంటుంది. ఒక్కోసారి ఫన్నీ ట్వీట్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. జొమాటో తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు (Zomato Viral Tweet).
భోపాల్ (Bhaopal)కు చెందిన అంకిత (Ankita) అనే యువతి తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై పగ తీర్చుకోవడానికి జొమాటోను వాడుకుంటోందని, తన మాజీ బాయ్‌ఫ్రెండ్ (Ex-boy friend) అడ్రస్‌కు క్యాష్ ఆన్ డెలివరీ (Cash on Delivery)పద్ధతిలో ఫుడ్ ఆర్డర్ చేస్తోందని, ఆ యువకుడు డబ్బులు ఇవ్వకుండా రిటర్న్ చేస్తున్నాడని జొమాటో ట్వీట్ చేసింది. ఇలా ఒకసారి కాదు మూడుసార్లు జరగిందని పేర్కొంది. జొమాటో చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంకిత నిజం కాదని, జొమాటో క్రియేట్ చేసిన క్యారెక్టర్ అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
Viral Video: ఈ బామ్మను చూసి సిగ్గుపడాల్సిందే.. 68 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న వర్కవుట్లు చూడండి..
``అంకిత.. ఇలా కూడా పగతీర్చుకోవచ్చా``, ``జీవితం మనకు ఓ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను ఇస్తే.. మీరు అతని కోసం ఫుడ్ ఆర్డర్ చేసి అతడు ఏం మిస్ అవుతున్నాడో చూపించండి``, ``అంకితా.. మీరు ఇస్తున్న ఫుడ్ ట్రీట్ పూర్తిగా ఉచితం అని అనుకుంటున్నాడేమో``, ``పాపం.. అంకితకు సహకరించవచ్చుగా``, ``జొమాటో మార్కెటింగ్ టెక్నిక్ బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-02T20:49:35+05:30 IST