ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sourav Ganguly-Kohli: ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న గంగూలీ-కోహ్లీ

ABN, First Publish Date - 2023-04-17T19:44:04+05:30

చూస్తుంటే విరాట్ కోహ్లీ (VIrat Kohli)-బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చూస్తుంటే విరాట్ కోహ్లీ (VIrat Kohli)-బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మధ్య వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఢిల్లీ కేపిటల్స్‌(DC)తో మ్యాచ్ తర్వాత గంగూలీతో చేయి కలిపేందుకు నిరాకరించిన కోహ్లీ.. తాజాగా గంగూలీని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో అన్‌ఫాలో చేసి మరోమారు చర్చకు తెరలేపాడు. గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా ఉండగా, విరాట్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం గంగూలీతో చేతులు కలిపేందుకు గంగూలీ నిరాకరించిన వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ అటు కోహ్లీ కానీ, ఇటు గంగూలీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. గంగూలీపై కోహ్లీపై కోపం పెంచుకోవడానికి ఓ పెద్ద కారణమే ఉంది. గంగూలీ బీసీసీఐ చీఫ్‌గా ఉన్నప్పుడే కోహ్లీ తన కెప్టెన్సీ కోల్పోయాడు. వీరిద్దరి మధ్య విభేదాలకు ఇదే కారణమని చెబుతారు. అయితే, ఈ విషయంలోనూ వీరిద్దరూ ఎప్పుడూ బయటపడలేదు.

ఇప్పుడు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడం లేదన్న విషయం బయటకొచ్చింది. ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని కోహ్లీ అన్‌ఫాలో చేయగా, ఇప్పుడు గంగూలీ కూడా కోహ్లీని అన్‌ఫాలో చేశాడు. గంగూలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. 106 మందిని ఫాలో అవుతున్నాడు. వారిలో కోహ్లీ లేకపోవడం గమనార్హం. ఇక కోహ్లీకి ఇన్‌స్టాలో 246 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. 276 మంది ఫాలో అవుతున్నాడు. వారిలో గంగూలీ లేడు. దీనిని బట్టి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

Updated Date - 2023-04-17T20:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising