Hulk Hogan: 70 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్
ABN, First Publish Date - 2023-09-26T09:29:46+05:30
డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ హల్క్ హోగన్ 70 ఏళ్ల వయసులో మూడో వివాహం చేసుకున్నాడు. ప్రియురాలు స్కై డైలీని శుక్రవారం ఫ్లోరిడాలో వివాహమడాడు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఫ్లోరిడా: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ హల్క్ హోగన్ 70 ఏళ్ల వయసులో మూడో వివాహం చేసుకున్నాడు. ప్రియురాలు స్కై డైలీని శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడాలో వివాహమడాడు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో దంపతులిద్దరూ 5 లక్షల డాలర్ల విలువైన రింగులను మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరలైన ఫోటోలో కనిపిస్తున్న దాని ప్రకారం వివాహం సమయంలో హల్క్ హోగన్ నలుపు రంగు గల కోటు, నలుపు రంగు గల ప్యాంట్‌తో నల్లని దుస్తుల్లో ఉన్నాడు. నల్లటి టోపిని కూడా ధరించాడు. 45 ఏళ్ల స్కై డైలీ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, లేస్ రైలుతో మెరిసే తెల్లటి స్ట్రాప్‌లెస్ గౌనులో కనిపించింది. ప్రస్తుతం హల్క్ హోగన్ యోగా శిక్షకుడిగా పని చేస్తుండగా.. స్కై డైలీ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. వీరి నిశ్చితార్ధం జూలైలో జరిగింది.
హోగన్ తన ప్రియురాలు స్కై డైలీకి ఫ్లోరిడాలోని టంపాలో గల ఓ రెస్టారెంట్‌లో లక్ష డాలర్ల విలువైన ఆరు క్యారెట్ల డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని హోగన్ అప్పట్లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. 26 ఫిబ్రవరి 2022న అమెరికన్ సింగర్ బ్రెట్ మైఖేల్స్ సంగీత కచేరీలో ఈ జంట మొదటిసారి బహిరంగంగా కనిపించింది. కాగా హల్క్ హోగన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలను తరచుగా అభిమానులతో పంచుకుంటాడు. కాగా హల్క్ హోగన్ తన రెండో భార్య జెన్నిఫర్ మెక్‌డానియల్‌కు ఏడాది క్రితమే విడుకులిచ్చాడు. హల్క్ హోగన్ 1983లో లిండాను మొదటి వివాహం చేసుకున్నాడు. హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ బోల్లియా. లిండా, హల్క్ హోగన్ దంపతులకు బ్రూక్, నిక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూతురు బ్రూక్ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. అయితే 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత జెన్నిఫర్ మెక్‌డానియల్‌ను వివాహం చేసుకున్నాడు. 2010లో వీరి వివాహం జరిగింది. అయితే 2021లో హోగన్, జెన్నిఫర్ విడాకులు తీసుకున్నారు. మరోవైపు స్కై డైలీకి కూడా ఇది మూడో వివాహం. ఆమెకు ఇది వరకే రెండు వివాహాలు అయ్యాడు. అంతేకాకుండా 9, 14, 16 సంవత్సరాల వయసు గల ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా హల్క్ హోగన్ 1980లలో అత్యంత ప్రజాదరణ పొందిన డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా ఉన్నాడు. అప్పట్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
Updated Date - 2023-09-26T09:32:30+05:30 IST