ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India Vs Australia: అశ్విన్, పుజారా ఇద్దరూ ఔట్.. ప్రస్తుతం స్కోరెంతంటే..

ABN, First Publish Date - 2023-02-10T11:29:34+05:30

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Australia) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) నిలకడగా ఆడుతోంది. రెండవ రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ఆస్ట్రేలియాకు తొలి వికెట్ లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Australia) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) ఆచితూచి ఆడుతోంది. రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ఆస్ట్రేలియాకు రెండవ రోజు ఆటలో తొలి వికెట్ లభించింది. 62 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసిన అశ్విన్.. ముర్ఫి బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అశ్విన్ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ముర్ఫీ బౌలింగ్‌లోనే బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

ఇక ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిలకడగా ఆడుతున్నాడు. 48 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 142/3గా ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ (83), విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. కాగా మొదటి రోజు కేఎల్ రాహుల్ రూపంలో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా విలవిల..

ఊహించినట్టుగానే టర్నింగ్‌ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా విలవిల్లాడింది. గురువారం ఆరంభమైన ఈ తొలి టెస్టు మొదటి రోజే గింగిరాలుతిరిగే బంతులతో లెఫ్టామ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (5/47), ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (3/42) దాడికి దిగారు. దీంతో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌డిజిట్‌కే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లు ఆడి 177 పరుగులే చేసింది. లబుషేన్‌ (49), స్మిత్‌ (37), క్యారీ (36), హ్యాండ్స్‌కోంబ్‌ (31) ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్‌ రోజు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక భారత్ రెండో రోజు పూర్తిగా బ్యాటింగ్‌ చేయగలిగితే మ్యాచ్‌లో ఆధిక్యం ప్రదర్శించినట్టే అవుతుంది.

జడ్డూ మాయ..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మొదటి సెషన్‌లో లబుషేన్‌, స్మిత్‌ ఆటతీరు చూశాక వీరిద్దరి నుంచి భారీ స్కోరు ఖాయమేననిపించింది. కానీ ఈ సెషన్‌లో స్పిన్‌ తడాఖాతో ఆసీస్‌ టపటపా ఆరు వికెట్లు కోల్పోయింది. ఇందులో 4 వికెట్లు జడేజానే తీశాడు. 36వ ఓవర్‌లో ఆసీ్‌సకు గట్టి ఝలక్‌నిస్తూ మొదట లబుషేన్‌, రెన్షా (0)లను జడ్డూ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు అక్షర్‌ ఓవర్‌లో స్మిత్‌ మూడు ఫోర్లతో బ్యాట్‌ ఝుళిపించాడు. కానీ అతడిని కూడా జడేజా తన అద్భుత బంతులతో ఆత్మరక్షణలోకి నెట్టి చివరికి బౌల్డ్‌ చేశాడు. అనంతరం అలెక్స్‌ క్యారీ, హ్యాండ్స్‌కోంబ్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. 54వ ఓవర్‌లో క్యారీని అశ్విన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌.. చివరి సెషన్‌ ఆరంభంలోనే మిగతా రెండు వికెట్లను కూడా చేజార్చుకుంది.

Updated Date - 2023-02-10T11:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising