Pat Cummins: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత
ABN, First Publish Date - 2023-03-10T12:38:19+05:30
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) తల్లి మారియా కమిన్స్(Mother Maria Cummins) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ..
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) తల్లి మారియా కమిన్స్(Mother Maria Cummins) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్(Cancer) మహమ్మారితో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్(Cricket Australia Twitter) వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆసీస్ జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మొదటి రెండు టెస్టులు కమిన్స్ నేతృత్వంలోనే కంగారు జట్టు భారత్‌తో తలపడింది కూడా. కానీ, తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో కమిన్స్ మిగతా రెండు టెస్టులు ఆడకుండానే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. తల్లిని దగ్గరుండి చూసుకోవాలన్న అతడి కోరికను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత తల్లితో ఉన్నందుకు ఆనందంగా ఉందంటూ కమిన్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఇక..పాట్ కమిన్స్(Pat Cummins) తల్లి మృతిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్(Cricket Board tweet) చేసింది.‘‘ మారియా కమిన్స్ చనిపోవడం బాధాకరం. కమిన్స్ కుటుంబ సభ్యలకు మా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్నితెలిపారు. ఈ విషాద సమయంలో కమిన్స్, అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూన్నాం’’ అని ట్వీట్ చేశారు.
Updated Date - 2023-03-10T12:38:19+05:30 IST