ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023, CSK VS LSG: లక్నోపై చెన్నై విజయం

ABN, First Publish Date - 2023-04-03T23:57:55+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య చెన్నై స్టేడియంలో రసవత్తరంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య చెన్నై స్టేడియంలో రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నోపై చెన్నై విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 20 పరుగుల తేడాతో చెన్నై విక్టరీ చేసింది. మొదటగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసి దుమ్ము రేపింది.

చెన్నై 217/7 భారీ స్కోర్ చేయగా, లక్నో 170/6 తో చతికిలపడింది. దీంతో మ్యాచ్ చెన్నై కైవసం చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57), డెవాన్ కాన్వే (29 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27), మొయిన్ అలీ (13 బంతుల్లో 19), అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్), కెప్టెన్ ధోనీ (3 బంతుల్లో 12) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బెన్ స్టోక్స్ (8), రవీంద్ర జడేజా (3) నిరాశపరిచారు. ఆఖరిలో ధోని(Dhoni) కూడా సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లక్నో బౌలర్‌లో మార్క్‌ వుడ్‌, బిష్ణోయ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేష్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. లక్నో బ్యాటింగ్‌: మేయర్స్‌ 53, పూరన్‌ 32 పరుగులు చేసిన లక్నోని విజయం వరించలేదు.

Updated Date - 2023-04-04T00:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising