IPL: ఐపీఎల్ మ్యాచ్‌లు మొబైల్‌లో చూడాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. !
ABN, First Publish Date - 2023-02-22T16:27:41+05:30
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 31 నుంచి ఐపీఎల్ సీజన్ 2023 సీజన్ (Indian Premier League 2023 (IPL) సందడి షురూ కాబోతోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Gujarat Titans Vs Chennai Super Kings) తలపడబోతున్నాయి. కాగా ఈ ఏడాది మ్యాచ్‌లు తొలిసారి...
ముంబై: క్రికెటంటే భారతీయులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకేవిధమైన క్రేజ్ కనిపిస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో జరిగే ఐపీఎల్‌కు (Indian premier league) ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలుసు. క్రికెట్ కిక్కు కోసం ఫ్యాన్స్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు వీక్షించేందేది వేలాది మంది అయితే.. ఇక పరోక్షంగానైతే కోట్లాది మంది మొబైల్ ఫోన్లలో మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. కాగా ఎప్పటిలాగనే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 31 నుంచి ఐపీఎల్ సీజన్ 2023 సీజన్ (Indian Premier League 2023 (IPL) సందడి షురూ కాబోతోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Gujarat Titans Vs Chennai Super Kings) తలపడబోతున్నాయి. కాగా ఈ ఏడాది మ్యాచ్‌లు తొలిసారి 4కే రిసొల్యూషన్‌లో (అల్ట్రాహెచ్‌డీ) స్ట్రీమింగ్ కాబోతున్నాయి. జియోసినిమా యాప్ (JioCinema App) ఉంటే ఉచితంగా 4కే రిసొల్యూషన్‌తో ఈ మ్యాచ్‌లు వీక్షించవచ్చు. కాగా మ్యాచ్‌లను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు రిలయన్స్ జియో (Reliance Jio) ఇటివలే నిర్ధారించిన విషయం తెలిసిందే.
కాగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మాదిరిగానే వేర్వేరు కెమెరా యాంగిల్స్‌లో ఈ ఏడాది మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లను జియోసినిమాలో వీక్షించవచ్చునని రిలయన్స్ జియో తెలిపింది. ఈ యాప్‌లో స్కోరుతోపాటు పలు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని ప్రకటించింది. ఇంగ్లీష్, తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాళీ, బోజ్‌పురి సహా మొత్తం 12 భాషల్లో మ్యాచ్‌లను స్ట్రీమ్ చేయనున్నట్టు తెలిపింది. లాంగ్వేజీ మార్చుకుంటే లాంగ్వేజీతోపాటు స్టాటస్టిక్స్, గ్రాఫిక్స్ కూడా మారతాయని వెల్లడించింది. కాగా గతేడాది వరకు ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ అయిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-02-22T16:35:38+05:30 IST