ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cricket News: ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏసీసీ

ABN, First Publish Date - 2023-09-08T14:11:05+05:30

పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలని భావిస్తున్న క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అదిరిపోయే న్యూస్ చెప్పింది. సూపర్-4లో భాగంగా ఈనెల 10న ఆదివారం నాడు కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్‌కు మరోసారి వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్ష సూచనల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పలు మార్లు వర్షం ఆటంకం కలిగించినా చివరకు భారత్ ఇన్నింగ్స్ పూర్తి చేసింది. కానీ వర్షం కారణంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్ మాత్రం సాధ్యం కాలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఏసీసీ రిజర్వ్ డే కేటాయించడంతో ఈనెల 10న వర్షం పడి కొంతసేపు మ్యాచ్ జరిగినా మిగతా ఆటను తర్వాతి రోజు అంటే 11వ తేదీ నిర్వహిస్తారు. ఎక్కడి వరకు మ్యాచ్ జరిగిందో అక్కడి నుంచి మళ్లీ ఆట జరుగుతుంది. అటు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు గతంలోనే రిజర్వ్ డేను కేటాయించారు.

ఇది కూడా చదవండి: MS Dhoni: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్

కాగా ఆదివారం జరిగే మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. సతీమణి ప్రసవం కోసం స్వదేశానికి వచ్చిన అతడు నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండు రోజుల తర్వాత మళ్లీ శ్రీలంకకు వచ్చిన బుమ్రా ఇప్పటికే జట్టుతో చేరాడు. మరోవైపు సర్జరీ తర్వాత సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌ కూడా భారత జట్టుతో కలిశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ద్వారా అతడు రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

Updated Date - 2023-09-08T14:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising