ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

All Time Record: క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు

ABN, First Publish Date - 2023-11-14T18:30:53+05:30

ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఇటీవల ముద్గీరబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరు బాల్స్‌లో ఆరు వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముద్గీరబ నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను చూశాం. కానీ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లను చూసిన దాఖలాలు లేవు. కానీ ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధ్యమైంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇప్పటి వరకు ఉన్న రికార్డు. న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్ దేశవాళీ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించాడు. 2011లో వెల్లింగ్టన్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓకే ఓవర్‌లో ఐదు వికెట్లు సాధించాడు. భారత్‌కు చెందిన అభిమన్యు మిథున్ కూడా ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 2019 రంజీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ఆడిన అభిమన్యు మిథున్.. హర్యానాపై ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం రికార్డు. శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ఈ ఫీట్ సాధించాడు.

ఇటీవల ముద్గీరబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరు బాల్స్‌లో ఆరు వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముద్గీరబ నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఎవరూ అందుకోని ఘనతను సొంతం చేసుకుని చరిత్రకెక్కాడు. ఈ ఫీట్‌ను గారెత్ మోర్గాన్ చివరి ఓవర్‌లో సాధించి ఔరా అనిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముద్గీరబ నేరంగ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 40 ఓవర్లలో 177 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టు 39 ఓవర్లకు 4 వికెట్లకు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 4 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో చివరి ఓవర్‌‌ను బౌలింగ్‌ చేసేందుకు గారెత్ మోర్గాన్ బరిలోకి దిగాడు. ఆశ్చర్యకర రీతిలో అతడు వరుసగా ఆరు బాల్స్‌లో 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. గారెత్ మోర్గాన్ దెబ్బకు ప్యారడైజ్ బ్యాటర్లలో ఐదుగురు గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఈ ఆరు వికెట్లలో మొదటి నలుగురు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మరో ఇద్దరూ క్లీన్ బౌల్డ్ అయ్యారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-14T18:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising