AUS vs NED: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం
ABN, First Publish Date - 2023-10-25T18:28:58+05:30
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపం చూపించింది. ఆ జట్టుపై ఏకంగా 399 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) మెరుపు...
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపం చూపించింది. ఆ జట్టుపై ఏకంగా 399 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) మెరుపు సెంచరీ చేయడం, డేవిడ్ వార్నర్ (104) కూడా శతక్కొట్టడంతో పాటు స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) మెరుగ్గా రాణించడంతో.. ఆస్ట్రేలియా జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ నలుగురు బ్యాటర్లను తమ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో నెదర్లాండ్స్‌కి ముచ్చెమటలు పట్టించేశారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకి ఆదిలోనే పెద్ద ఝలక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ మిచెల్ మార్ష్ 9 వ్యక్తిగత పరుగులకే ఔట్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ కలిసి డేవిడ్ వార్నర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరు వెంటనే మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించారు. రెండో వికెట్‌కి వీళ్లు 132 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీళ్లిద్దరు బాగా క్రీజులో కుదురుకున్నారని అనుకునేలోపే.. ఆర్యన్ దత్ వీరి జోడీని బ్రేక్ చేశాడు. అతడు స్టీవ్ స్మిత్ వికెట్‌ని పడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన లబుషేన్‌తోనూ వార్నర్ మంచి పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశాడు.
అయితే.. 244 పరుగుల వద్ద లబుషేణ్ ఔట్ అవ్వగానే, ఆస్ట్రేలియా జట్టు వెనువెంటనే మరో మూడు వికెట్లు కోల్పోయాడు. 42.2 ఓవర్లలో 290 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోవడంతో.. ఆస్ట్రేలియా 350 వరకు లాక్కొని రావొచ్చని అంతా అనుకున్నారు. అప్పుడే.. నన్ను మర్చిపోయారా? అంటూ బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్ మెరుపుదాడి చేశాడు. ఎడాపెడా షాట్లతో అతడు బౌండరీల మోత మోగించేసి.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. కేవలం 44 బంతుల్లోనే 106 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇతని ధాటికి.. 350కే ఆగిపోతుందనుకున్న ఆస్ట్రేలియా స్కోరు 399కి చేరింది. మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ని ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేశారు.
ఇక నెదర్లాండ్స్ బౌలర్ల విషయానికొస్తే.. కోలిన్, విక్రమ్‌జిత్ సింగ్ మినహాయిస్తే మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చేశారు. బస్ దే లీడే రెండు వికెట్లైతే తీశాడు కానీ.. తన 10 ఓవర్ల కోటాలో మాత్రం ఏకంగా 115 పరుగులు సమర్పించేసుకున్నాడు. లోగన్ 4 వికెట్లు తీసి, 74 పరుగులిచ్చాడు. అర్యన్ దత్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ పసికూన ఆస్ట్రేలియా మీద గెలవాలంటే.. 400 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. అంత భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ఛేధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Updated Date - 2023-10-25T18:28:58+05:30 IST