ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AUS vs NED: చిత్తుచిత్తుగా ఓడిన నెదర్లాండ్స్.. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

ABN, First Publish Date - 2023-10-25T21:29:17+05:30

వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 90 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది.

వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 90 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. దీంతో.. ఆస్ట్రేలియా జట్టు 309 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్‌కప్ చరిత్రలో ఇంత భారీ తేడాతో గెలుపొందడం ఇదే మొదటిసారి. దీంతో.. వరల్డ్‌కప్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వార్నర్ (104) శతక్కొట్టడం, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) ఊచకోత కోయడంతో పాటు స్టీవ్ స్మిత్ (71), లబుషేన్ (62) అర్థశతకాలతో మెరుగ్గా రాణించడం వల్ల.. ఆసీస్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 400 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే.. నెదర్లాండ్స్ బ్యాటర్లు ఎంత ఘోర ప్రదర్శన కనబరిచారో అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు డకౌట్ అవ్వగా, మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు.

నిజానికి.. నెదర్లాండ్స్ జట్టు తొలుత నిలకడగానే ఆడింది. నాలుగు ఓవర్ల వరకు మెరుగ్గా రాణించింది. విక్రమ్‌జిత్ మొదట్లో బౌండరీలు బాగానే బాదాడు. కానీ.. ఓపెనర్లలో మ్యాక్స్ ఔట్ అయిన వెంటనే.. నెదర్లాండ్స్ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఎవరైనా ఒకరు నిలకడగా రాణిస్తారని అనుకుంటే నిరాశే మిగిలింది. 90 పరుగులకే నెదర్లాండ్స్ కథ ముగిసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే.. ఆడమ్ జంపా వేసింది మూడు ఓవర్లే అయినా నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్ తలా ఒక వికెట్ తీశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినందుకు గాను.. అతడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.

Updated Date - 2023-10-25T21:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising