Bangladesh: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
ABN, First Publish Date - 2023-03-23T21:46:13+05:30
బంగ్లాదేశ్(Bangladesh) బ్రహ్మాండమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల
సిల్హెట్: బంగ్లాదేశ్(Bangladesh) బ్రహ్మాండమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల ఇంగ్లండ్(England)తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. తాజాగా మరో రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్(Ireland)తో గురువారం సిల్హెట్‌లో జరిగిన మూడో వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పది వికెట్ల తేడాతో విజయం సాధించడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 28.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కర్టిస్ కాంఫెర్ అత్యధికంగా 36 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకెర్ 28 పరుగులు చేశాడు. మిగతా ఎవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు.
అనంతరం 102 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్..13.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 41, లిటన్ దాస్ 50 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2-0తో బంగ్లాదేశ్ వశమైంది.
Updated Date - 2023-03-23T21:46:13+05:30 IST