BAN Vs NZ: న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం.. సొంతగడ్డపై ఇదే తొలి విక్టరీ
ABN, First Publish Date - 2023-12-02T13:30:34+05:30
ICC Test Championship 2023-25: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై 9వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై 9వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. సైలెట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హసన్ జాయ్ 86 పరుగులతో రాణించడంతో 85.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 4 వికెట్లు పడగొట్టగా.. కైల్ జేమీసన్, అజాజ్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించారు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసి 7 రన్స్ స్వల్ప ఆధిక్యం సాధించింది. కేన్ విలియమ్సన్ సెంచరీ(104)తో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 42, డారిల్ మిచెల్ 41 తమ సహకారం అందించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4 వికెట్లు, మోనిముల్ హక్ 3 వికెట్లు పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంతో సెంచరీ చేశాడు. ముష్ఫీకర్ రహీమ్ (67), మెహిదీ హసన్ మిరాజ్ (50) హాఫ్ సెంచరీతో సత్తా చాటుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ 338 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఆధిక్యం తీసివేయగా ఆ జట్టు ముందు 332 పరుగుల టార్గెట్ నిలిచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (58) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. చివర్లో కెప్టెన్ టిమ్ సౌథీ (34) పోరాడినా ఫలితం లేకపోయింది. తైజుల్ ఇస్లాం మరోసారి 6 వికెట్లతో చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ 181 పరుగులకే కుప్పకూలింది. కాగా ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో రాణించిన తైజుల్ ఇస్లాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌ను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇది రెండోసారి మాత్రమే.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-02T13:30:37+05:30 IST