CSK vs PBKS: చెలరేగిన కాన్వే.. సిక్సర్లతో ముగించిన ధోనీ.. ఢిల్లీ ఎదుట భారీ లక్ష్యం
ABN, First Publish Date - 2023-04-30T17:38:06+05:30
కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) నమ్మకాన్ని చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj
చెన్నై: కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) నమ్మకాన్ని చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad), డెవోన్ కాన్వే (Devon Canway) వమ్ము చేయలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను జోరుగా ప్రారంభించారు. కాన్వే చెలరేగుతుంటే గైక్వాడ్ నిదానంగా ఆడుతూ అతడికి సహకారం అందించాడు.
ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతున్నవేళ 37 పరుగులు చేసిన గైక్వాడ్.. సికిందర్ రజా బౌలింగులో అవుటయ్యాడు. దీంతో 86 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన దూబే (28), మొయిన్ అలీ (10), రవీంద్ర జడేజా (12) స్వల్ప వ్యవధిలోనే అవుటైనప్పటికీ క్రీజులో పాతుకుపోయిన కాన్వే మాత్రం తగ్గేదే లే అన్నట్టు ఆడాడు. ఫోర్లతో పంజాబ్ బౌలర్లతో విరుచుకు పడ్డాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న కాన్వే 16 బౌండరీలతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
జడేజా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోనీ నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని 13 పరుగులు చేశాడు. శామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి రెండు బంతులను ధోనీ స్టాండ్స్‌లోకి తరలించి ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో 200, ఆపైన పరుగులు చేయడం చెన్నైకి ఇది 27వ సారి. బెంగళూరు 24, కోల్‌కతా, పంజాబ్ చెరో 19 సార్లు 200, ఆపైన పరుగులు చేశాయి.
Updated Date - 2023-04-30T17:38:06+05:30 IST