Harmanpreet Kaur: మీడియా సమావేశంలో హర్మన్‌ప్రీత్ కళ్లద్దాలు ఎందుకు తీయలేదంటే?
ABN, First Publish Date - 2023-02-24T21:25:13+05:30
మహిళల టీ20 ప్రపంచకప్(ICC Womens T20 World Cup)లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన
కేప్‌టౌన్: మహిళల టీ20 ప్రపంచకప్(ICC Womens T20 World Cup)లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు(Team India) చివరి వరకు పోరాడి ఓడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur), దీప్తి శర్మ(Deepti Sharma) రాణించినా వికెట్లు త్వరత్వరగా కోల్పోవడంతో ఓటమి నుంచి హర్మన్‌ప్రీత్ జట్టు తప్పించుకోలేకపోయింది. దీనికి తోడు కీలక సమయంలో హర్మన్ రనౌట్ కావడం భారత జట్టు కొంపముంచింది.
ఈ ఓటమితో భారత జట్టే కాదు.. అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, మైదానంలోనే కన్నీరు పెట్టుకున్న హర్మన్‌ను అంజుమ్ చోప్రా ఓదార్చింది. ఇక, మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశానికి హర్మన్ కళ్లద్దాలతో హాజరైంది. గమనించిన కామెంటేటర్ కళ్లద్దాలు ఎందుకు తీయడం లేదని ప్రశ్నించాడు. స్పందించిన హర్మన్.. ఓటమి చాలా బాధించిందని, కన్నీళ్లు ఆగడం లేదని సమాధానమిచ్చింది. తన కన్నీళ్లను దేశం చూడకూడదన్న ఉద్దేశంతోనే కళ్లద్దాలు పెట్టుకుని వచ్చినట్టు చెప్పింది. మరోసారి మాత్రం దేశాన్ని నిరాశపర్చబోమని, పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.
Updated Date - 2023-02-24T21:25:15+05:30 IST