ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heinrich Klaasen: ఒక్క ఇన్నింగ్స్.. రికార్డులే రికార్డులు

ABN, First Publish Date - 2023-09-16T21:35:40+05:30

దక్షిణాఫ్రికా బ్యాటర్‌, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు.

ప్రపంచ అత్యుత్తమ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు రెచ్చిపోయింది. దీంతో ఏకంగా వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. 50 ఓవ‌ర్ల ఆట‌లో రికార్డు స్థాయిలో 7వసారి 400కు పైగా స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్‌లో టీమిండియా గతంలో నెల‌కొల్పిన ప్రపంచ‌ రికార్డును స‌ఫారీ జ‌ట్టు బ‌ద్దలు కొట్టింది. భారత్ ఇప్పటివరకు 6 సార్లు 400కు పైగా ప‌రుగులు చేసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్‌ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. తద్వారా ఒక్క ఇన్నింగ్స్‌తో క్లాసెన్‌ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: ఫైనల్‌కు ముందు టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్‌ చరిత్ర సృష్టించాడు. మరోవైపు వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 52 బంతుల్లో ఆసీస్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్ 5లో బరిలోకి దిగి వేగంగా సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అదే విధంగా వన్డే క్రికెట్‌ చరిత్రలో క్లాసెన్‌ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అటు ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది క్లాసెన్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్ అఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు.

Updated Date - 2023-09-16T21:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising