ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కింద ఇచ్చేది రూ.41వేలు మాత్రమే..!!

ABN, First Publish Date - 2023-07-15T19:53:55+05:30

వెస్టిండీస్ బోర్డు ఆర్ధిక నష్టాల్లో ఉండటంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీ 500 డాలర్లు మాత్రమే ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షెడ్యూల్ బిజీగా ఉన్నా వెస్టిండీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడేందుకు అక్కడి క్రికెట్ బోర్డుకు ఆర్ధికంగా చేయూత అందించడానికే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా నోరుమెదపడం లేదని.. కానీ టీమిండియా అభిమానులు మాత్రం మీమ్స్ రూపంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై సెటైర్లు వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్‌ల (Cricket Match) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రెండు నెలలకొకసారి క్రికెట్ మ్యాచ్‌లు ఉండేవి. కానీ ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. టీ20 లీగ్‌ల (T20 League) కారణంగా మ్యాచ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ (Man of the match) కింద ఇచ్చే ప్రైజ్ మనీ (Prize Money) కూడా భారీ మొత్తంలోనే ఉంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఆటగాడికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నారు. అయితే వెస్టిండీస్ (West Indies) పర్యటనలో ఉన్న టీమిండియా(Team India)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఇచ్చే ప్రైజ్ మనీ ఆశ్చర్యం కలిగించి ఉంటుంది.

వివరాల్లోకి వెళ్తే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకోవడంతో వెస్టిండీస్‌పై టీమిండియా 141 ఇన్నింగ్స్ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన టీమిండియా యువ ఆటగాడు యషస్వీ జైశ్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డు కింద వెస్టిండీస్ బోర్డు కేవలం 500 డాలర్లు మాత్రమే ఇచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.41వేలు అన్నమాట. టీ20 లీగ్‌లలోనే మినిమం రూ.లక్ష ఇస్తున్న ఈ రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ కింద కేవలం రూ.41వేలు మాత్రమే ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: ధోని రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

అయితే వెస్టిండీస్ బోర్డు ఆర్ధిక నష్టాల్లో ఉండటంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీ 500 డాలర్లు మాత్రమే ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షెడ్యూల్ బిజీగా ఉన్నా వెస్టిండీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడేందుకు అక్కడి క్రికెట్ బోర్డుకు ఆర్ధికంగా చేయూత అందించడానికే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా నోరుమెదపడం లేదని.. కానీ టీమిండియా అభిమానులు మాత్రం మీమ్స్ రూపంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై సెటైర్లు వేస్తున్నారు. కాగా రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు ఈనెల 20 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన విండీస్ రెండో టెస్టులో అయినా పుంజుకుంటుందేమో వేచి చూడాలి.

Updated Date - 2023-07-15T19:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising