IND vs NZ: న్యూజీలాండ్ జట్టుపై షమీ తాండవం.. భారత్ ముందు లక్ష్యం ఎంతంటే?
ABN, First Publish Date - 2023-10-22T18:25:13+05:30
వన్డే వరల్డ్ కప్ 2013లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజీలాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు...
వన్డే వరల్డ్ కప్ 2013లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజీలాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 273 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డేరిల్ మిచెల్ (130) శతక్కొట్టడంతో పాటు రచిన్ రవీంద్ర (75) మెరుగ్గా రాణించడం వల్లే.. కివీస్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్‌తో తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమీ ‘ఛాంపియన్ పెర్ఫార్మెన్స్’తో అదరగొట్టేశాడు. తన 10 ఓవర్ల కోటాలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. న్యూజీలాండ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కివీస్ జట్టుకి ఝలక్ తగిలింది. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అప్పుడు రవీంద్ర, మిచెల్ కలిసి తమ జట్టుని ఆదుకున్నారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ.. వీళ్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించారు. మూడో వికెట్‌కి ఏకంగా 159 పార్ట్నర్‌షిప్ చేశారు. ఇద్దరూ క్రీజులో కుదురుకోవడం, ఎంతసేపటికీ ఔట్ అవ్వకపోవడంతో.. చివరివరకూ వీళ్లే నిలబడతారేమోనని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే షమీ రంగంలోకి దిగి.. వీరి జోడిని బ్రేక్ చేశాడు. రవీంద్రను పెవిలియన్‌కు పంపించి.. వీరి భాగస్వామ్యానికి ముగింపు పలికాడు.
అప్పటి నుంచి కివీస్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. డేరిల్ మిచెల్ ఒక్కడే రాణిస్తుండగా.. మిగతా బ్యాటర్లు మాత్రం క్రీజులో వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (23) కాస్త పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. షమీ ఐదు వికెట్లతో కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు.. సిరాజ్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే భారత్ 274 పరుగులు చేయాల్సి వస్తుంది. మరి, ఈ డీసెంట్ టార్గెట్‌ని భారత్ ఛేధిస్తుందా? ఈ జట్టుని ఓడించి 2019 వరల్డ్ కప్ నాటి పరాజయానికి తన ప్రతీకారం తీర్చుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Updated Date - 2023-10-22T18:25:13+05:30 IST