India vs Australia: తొలి వన్డే సీన్‌ను రిపీట్ చేసిన మిచెల్ స్టార్క్-సూర్యకుమార్ యాదవ్
ABN, First Publish Date - 2023-03-19T20:31:39+05:30
ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు(Team India) ఘోర పరాజయాన్ని
విశాఖపట్నం: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు(Team India) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు విజృంభించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 26 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పర్యాటక జట్టు 11 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఘన విజయం సాధించింది.
ముంబైలో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను వణికించిన మిచెల్ స్టార్క్(Mitchell Starc) ఈ మ్యాచ్‌లోనూ అదే పనిచేశాడు. పదునైన బంతులతో భారత టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను వెంటవెంటనే వెనక్కి పంపి కోలుకోలేని దెబ్బకొట్టాడు.
శుభమన్ గిల్, రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్, సూర్యకుమార్ రెండు వరుస బంతుల్లో అవుటయ్యారు. తొలి వన్డేలోనూ అచ్చం ఇలానే జరిగింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ స్టార్క్ బౌలింగులోనే రెండు వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. అంతేకాదు అప్పుడు, ఇప్పుడు కూడా ఐదో ఓవర్‌లోనే జరగడం మరో విశేషం. సూర్యకుమార్(Suryakumar Yadav) అప్పుడు కూడా ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ కాగా, వైజాగ్ వన్డేలోనూ అదే సీన్ రిపీటైంది.
Updated Date - 2023-03-19T20:31:39+05:30 IST