ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs NZ: 100 కొట్టి 1000 దాటేశాడు.. హైదరాబాద్ వన్డేలో అదరగొట్టిన గిల్..

ABN, First Publish Date - 2023-01-18T16:05:45+05:30

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో గిల్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. 19 వన్డే ఇన్నింగ్స్ ఆడిన గిల్ మూడు సెంచరీలతో సత్తా చాటాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సరసన గిల్ నిలిచాడు. శిఖర్ ధావన్ 17 ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కూడా గిల్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. 89 బంతుల్లో గిల్ లంకపై సెంచరీ చేశాడు.

లంకతో చివరి వన్డేలో గిల్ 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి సత్తా చాటాడు. కివీస్‌పై సెంచరీతో బ్యాక్‌ టూ బ్యాక్ సెంచరీలు చేసిన ఘనత గిల్‌కు దక్కింది. గిల్‌ హైదరాబాద్ వన్డేతో మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌లో 1003 పరుగులు చేసి గిల్ వెయ్యి పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. 33 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 93 బంతుల్లో 110 పరుగుల‌తో, హార్థిక్ పాండ్యా 17 బంతుల్లో 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సూర్యకుమార్ యాదవ్ 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ బౌలింగ్‌లో శాంటర్న్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. శ్రీలంకతో వన్డేల్లో సెంచరీలతో వీర విహారం చేసిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కివీస్ బౌలర్ శాంట్నర్ బౌలింగ్‌లో 8 పరుగులకే క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాథమ్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు. ఇలా.. 20 ఓవర్ల లోపే 3 కీలక వికెట్లను కోల్పోయిన టీమిండియా 114 పరుగుల చేసింది. శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతూ సెంచరీతో పూర్తి చేయడంతో టీమిండియా మంచి స్కోర్ చేయగలిగింది.

Updated Date - 2023-01-18T16:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising