ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs NZ: గిల్ డబుల్ సెంచరీ వృథా కాదేమో.. 20 ఓవర్లకే కివీస్ అన్ని వికెట్లు కోల్పోయిందంటే..

ABN, First Publish Date - 2023-01-18T20:15:59+05:30

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ తడబడింది. 97 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్ 40 పరుగులు, కాన్వే 10 పరుగులకే ఔట్ కావడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ (IND vs NZ) తడబడింది. 97 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్ (Finn Allen) 40 పరుగులు, కాన్వే (Conway) 10 పరుగులకే ఔట్ కావడంతో న్యూజిలాండ్ 28 పరుగుల వద్ద ఒక వికెట్ (కాన్వే), 70 పరుగుల వద్ద రెండో వికెట్ (అలెన్) కోల్పోయింది. శార్దూల్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌ షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్‌గా అలెన్ దొరికిపోగా, సిరాజ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్‌గా కాన్వే చిక్కడంతో న్యూజిలాండ్ ఓపెనర్ల కథ ముగిసింది. ఆ తర్వాత.. హెన్రీ నికోలస్ కుల్దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. డారెల్‌ మిచెల్‌ కూడా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుల్దీప్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.

ఇలా.. కుల్దీప్ బౌలింగ్‌లో రాణించి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే కాగా, టీమిండియా 20 ఓవర్ల సమయానికి 3 వికెట్లను కోల్పోయి 114 పరుగులు చేయడం గమనార్హం. కివీస్ వికెట్లు పడిపోతున్న తీరు గమనిస్తే.. తొలి వన్డేలో విజయావకాశాలు దాదాపు చేజారినట్టుగానే కనిపిస్తోంది. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (208) పరుగుల డబుల్ సెంచరీ వృథా కాదన్న నమ్మకం టీమిండియా అభిమానుల్లో వ్యక్తమైంది.

వన్డే సిరీస్‌లో పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై 2-1తో ఓడించిన న్యూజిలాండ్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం అంత గొప్ప ఆటతీరును కనబర్చలేకపోయింది. టీమిండియాకు ఎప్పుడూ కఠిన సవాల్‌ విసిరే జట్టుగా కివీస్‌కు పేరుంది. కానీ.. తొలి వన్డేలో గిల్ పుణ్యాన టీమిండియా 349 పరుగులు చేయగలిగింది. కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీలకు విశ్రాంతి నివ్వడంతో.. టామ్‌ లాథమ్‌ న్యూజిలాండ్‌కు సారథ్యం వహించాడు. ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌, కాన్వే తక్కువ పరుగులకే ఔట్ కావడం కివీస్‌ను దెబ్బతీసిన ప్రధానాంశంగా చెప్పొచ్చు.

Updated Date - 2023-01-18T20:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising