IND vs NZ: కివీస్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ABN, First Publish Date - 2023-01-21T14:01:54+05:30
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా (IND vs NZ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో కివీస్‌పై ‘గెలిచామంటే గెలిచాం’ అన్నట్టుగా..
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా (IND vs NZ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో కివీస్‌పై ‘గెలిచామంటే గెలిచాం’ అన్నట్టుగా సాగిన టీమిండియా (Team India) ఆటతీరు రెండో వన్డేలో అయినా మెరుగుపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. హైస్కోరింగ్ థ్రిల్లర్‌గా నిలిచిన ఉప్పల్ మ్యాచ్‌లో కివీస్ ఏడో నెంబర్ బ్యాటర్ బ్రేస్‌వెల్ (Bracewell) అసాధారణ ఆటతీరుతో ముచ్చెమటలు పట్టించాడు. గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో భారత్‌కు భారీ స్కోరు అందించినా ఓ దశలో అదీ తక్కువే అనిపించింది. అందుకే ఈ మ్యాచ్ మనోళ్లకు అంత సులువు కాబోదు. ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా చెలరేగితేనే సిరీస్ (New Zealand ODI Series) దక్కుతుంది. మరోవైపు గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో నెంబర్ వన్ టీమ్ కివీస్ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడాలనుకుంటోంది.
సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో గిల్ డబుల్ సెంచరీ పుణ్యమా అని జట్టు 340+ స్కోరు సాధించగలిగింది. కానీ కెప్టెన్ రోహిత్ తన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలుచుకోలేకపోతున్నాడు. అలాగే కోహ్లీ, హార్దిక్, ఇషాన్, సూర్యకుమార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరంతా రాయ్‌పూర్‌లో బ్యాట్లు ఝుళిపించకపోతే జట్టు ఇబ్బందిపడడం ఖాయమే. ఇక బౌలర్లు ఆరంభంలో కివీస్‌ను అద్భుతంగా అడ్డుకోగలిగినా ఆ తర్వాత చేతులెత్తేశారు. ఓ దశలో 131/6 స్కోరుతో ప్రత్యర్థికి భారీ ఓటమి ఖాయమనిపించింది. కానీ బ్రేస్‌వెల్, శాంట్నర్ భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ 337 పరుగులు సాధించి బౌలింగ్ తీరును చర్చనీయాంశం చేశారు. వెటరన్ షమి సైతం ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు.
పేసర్ సిరాజ్ మాత్రం వరుసగా నాలుగు వికెట్లతో ప్రభావం చూపి రిలీఫ్‌నిచ్చాడు. శార్దూల్‌ను బౌలర్‌గానే కాకుండా అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తొలి వన్డే ఆడించారు. రెండో వన్డేలో కూడా శార్దూల్‌కే అవకాశం ఇచ్చారు. 350 పరుగుల లక్ష్యం కోసం ఎలాంటి ఆశలు లేని స్థితి నుంచి ఏడు, ఎనిమిదో నెంబర్ బ్యాటర్లు బ్రేస్‌వెల్, శాంట్నర్ అద్వితీయ బ్యాటింగ్ తీరు కివీస్‌లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఓటమి ఖాయమనే పరిస్థితి నుంచి వీరు తమ జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చారు.
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, కాన్వే, హెన్రీ నికోలస్, మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్&వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, హెన్రీ షిప్లే, ఫెర్గ్యూసన్, టిక్నర్
Updated Date - 2023-01-21T14:01:57+05:30 IST