Rishabh Pant: రిషభ్ పంత్‌కు సర్జరీ.. స్పందిస్తున్న క్రికెటర్
ABN, First Publish Date - 2023-01-07T15:55:38+05:30
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh
ముంబై: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం మధ్యాహ్నం పంత్‌కు ఆపరేషన్ నిర్వహించింది. శస్త్రచికిత్స విజయవంతమైందని, పంత్‌ను మూడు నాలుగు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు పంత్ స్పందిస్తున్నట్టు పేర్కొన్నారు.
డిసెంబరు 30న రాత్రి ఢిల్లీ (Delhi) నుంచి రూర్కీ(Roorkee)కి కారులో బయలుదేరిన పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పాత్‌హోల్‌ను తప్పించే క్రమంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్(Dehradun)లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముంబైకి తరలించారు. ప్రమాదం నుంచి తనను కాపాడిన ఇద్దరు యువకులను పంత్ డెహ్రాడూన్ ఆసుపత్రిలో కలుసుకున్నాడు. పంత్ త్వరగా కోలుకోవాలని భారత జట్టు సహా అభిమానులందరూ ఆకాంక్షిస్తున్నారు. పంత్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్(One Day World Cup)కు అతడు దూరమైనట్టే.
Updated Date - 2023-01-07T15:57:13+05:30 IST