ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: లక్నోపై టాస్ గెలిచిన గుజరాత్.. మళ్లీ గెలుపుబాట పట్టేనా?

ABN, First Publish Date - 2023-04-22T15:21:38+05:30

ఐపీఎల్‌(IPL 2023)లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ఐపీఎల్‌లో ఇది 30వ మ్యాచ్. లక్నోపై టాస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఐపీఎల్‌(IPL 2023)లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ఐపీఎల్‌లో ఇది 30వ మ్యాచ్. లక్నోపై టాస్ గెలిచిన గుజరాత్(GT) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చూడ్డానికి ట్రాక్ స్లోగా కనిపిస్తోందని, దాని నుంచి లబ్ధి పొందుతామని అన్నాడు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచినా బ్యాటింగే ఎంచుకుని ఉండేదన్నాడు. ఈ మ్యాచ్‌తో గుజరాత్ ఆటగాడు నూర్ అహ్మద్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తమ బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచారని ప్రశంసించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul).. ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని తక్కువ పరుగులకే పరిమితం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఆ తర్వాత దానిని సులభంగా ఛేదిస్తామన్నాడు. లక్నో జట్టులోకి యుధ్‌వీర్ స్థానంలో అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చాడు.

గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 10 పరుగుల తేడాతో మట్టికరిపించిన లక్నో బ్యాక్ టు బ్యాక్ విజయాలపై కన్నేసింది. మరోవైపు, అదే రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మళ్లీ గెలుపు దారి పట్టాలని భావిస్తోంది.

Updated Date - 2023-04-22T15:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising