ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: కోల్‌కతాతో మ్యాచ్.. మారిన గుజరాత్ కెప్టెన్!

ABN, First Publish Date - 2023-04-09T15:28:00+05:30

ఐపీఎల్‌(IPL 2023)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: ఐపీఎల్‌(IPL 2023)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తలపడేందుకు సిద్ధమయ్యాయి. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) స్వల్ప అస్వస్థతకు గురికావడంతో నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో రషీద్ ఖాన్(Rashid Khan) స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన రషీద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టుకు దూరమైన పాండ్యా స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. టిమ్ సౌథీ స్థానంలో లాకీ ఫెర్గ్యూసన్, మన్‌దీప్ సింగ్ స్థానంలో జగదీశన్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టుకు విజయాన్ని అందించిపెట్టాలని రషీద్ ఖాన్ యోచిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గుజరాత్ విజయాలకు అడ్డుకట్ట వేయాలని కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా పట్టుదలగా ఉన్నాడు. గుజరాత్‌ను వీలైనంత తక్కువ పరుగులకు కట్టడి చేసి, ఆపై సునాయాస ఛేజింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించిపెట్టాలని నితీశ్ రాణా భావిస్తున్నాడు.

Updated Date - 2023-04-09T15:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising