ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: బౌలర్లను ఉతికేసిన ఆర్సీబీ.. లక్నో ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2023-04-10T21:38:46+05:30

తొలుత విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆ తర్వాత డుప్లెసిస్(Duplessis), చివర్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: తొలుత విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆ తర్వాత డుప్లెసిస్(Duplessis), చివర్లో మ్యాక్స్‌వెల్(Maxwell) చెలరేగిపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న ఐపీఎల్ 15వ మ్యాచ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన బెంగళూరు ఏ దశలోనూ తగ్గేదేలే అన్నట్టు ఆడింది. తొలుత విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. లక్నో బౌలర్లను ఆడేసుకున్నాడు. టోర్నీలో రెండో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మొత్తంగా 44 బంతులు ఆడిన కోహ్లీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ కూడా బ్యాట్‌తో వీరంగమేశాడు. యథేచ్ఛగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 29 బంతులు ఆడిన మ్యాక్స్‌వెల్ 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 59 పరుగులు చేసి చివరి ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు.

మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ ఫా డుప్లెసిస్ కూడా బౌలర్లను ఆడేసుకున్నాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి ముగ్గురు అర్ధ సెంచరీలతో విరుచుకుపడడంతో పరుగులు పెట్టిన స్కోరు 212 పరుగుల వద్ద ఆగింది.

Updated Date - 2023-04-10T21:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising