ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: రోహిత్‌శర్మ సాధించిన.. ముందున్న రికార్డులివే!

ABN, First Publish Date - 2023-03-28T21:13:28+05:30

మరో రెండు రోజుల్లో పొట్టి పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ముంబై స్కిప్పర్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టి ఉంది. ఐపీఎల్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మరో రెండు రోజుల్లో పొట్టి పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ముంబై స్కిప్పర్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టి ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటికే పలు రికార్డులను రోహిత్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ను మరిన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో చూద్దామా!

* రోహిత్ 227 మ్యాచుల్లో 30.30 సగటుతో 5,879 పరుగులు చేశాడు

* స్ట్రైక్ రేట్ 129.89. 40 అర్ధ సెంచరీలు, ఓ శతకం బాదాడు

* 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అజేయ సెంచరీ (109) నమోదు చేశాడు

* పరుగుల్లో రోహిత్ కంటే విరాట్ కోహ్లీ ( 6,624), శిఖర్ ధావన్ (6,244), డేవిడ్ వార్నర్ (5,881) ముందున్నారు

* ఈ సీజన్‌లో రోహిత్ 6 వేల మార్కును చేరుకోవచ్చు

* 6 వేల మార్కును చేరుకునేందుకు రోహిత్‌కు కావాల్సింది 121 పరుగులు మాత్రమే

* డేవిడ్ వార్నర్ కూడా ఈ మైలురాయికి చేరువలోనే ఉన్నాడు

* ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో మరెవరూ 5 వేలు, అంతకంటే ఎక్కువ పరుగులు చేయలేదు

* 2011లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం తర్వాత 182 మ్యాచుల్లో 30.18 సగటుతో 4,709 పరుగులు చేశాడు

* ముంబై ఇండియన్స్ తరపున 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు రోహిత్‌కు కావాల్సింది మరో 291 పరుగులు మాత్రమే

* ప్రస్తుతం ఉనికిలో లేని డెక్కన్ చార్జర్స్‌కు రోహిత్ మూడు సీజన్లలో ప్రాతినిధ్యం వహించాడు

* కెప్టెన్‌గా రోహిత్ 143 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. మరో 7 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తే 150 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో క్రికెటర్ అవుతాడు

* ప్రస్తుతం ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ పేరుపై ఉంది

* రోహిత్ 143 మ్యాచ్‌ల్లో జట్టుకు 79 విజయాలు అందించాడు. (సూపర్ ఓవర్‌లో సాధించిన విజయాలు కాకుండా)

* టీ20 క్రికెట్‌లో ఓవరాల్‌గా రోహిత్ 407 మ్యాచుల్లో 10,703 పరుగులు చేశాడు.

* కోహ్లీ ఇప్పటికే 11,326 పరుగులు చేశాడు. ఇప్పుడీ ఫీట్‌కు రోహిత్ దగ్గరగా ఉన్నాడు

* క్రిస్ గేల్ (14,562), కీరన్ పొలార్డ్ (12,528), షోయబ్ మాలిక్ (12,175), ఆరోన్ ఫించ్ (11,392), వార్నర్ (11,179),అలెక్స్ హేల్స్ (10,916) రోహిత్ కంటే ముందున్నారు

* ఫీల్డర్‌గా కోహ్లీ 97 క్యాచ్‌లు అందుకున్నాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు అతడిదే

* సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) మాత్రమే వందకు పైగా క్యాచ్‌లు పట్టుకోగలిగారు. కోహ్లీ ఖాతాలో 93, ధావన్ ఖాతాలో 92 క్యాచ్‌లు ఉన్నాయి

* ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకున్న ఒకే ఒక్క కెప్టెన్ రోహిత్ శర్మ

* మొత్తంగా అతడి ఖాతాలో 6 ఐపీఎల్ టైటిళ్లు ఉన్నాయి. 2009లో డెక్కన్ చార్జర్స్‌కు టైటిల్ అందించిపెట్టాడు.

* రోహిత్ వరుసగా 133 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. రైనా ఒక్కడే వరుసగా 134 మ్యాచ్‌లు ఆడాడు.

Updated Date - 2023-03-28T21:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising