ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ధోనీపై టాస్ గెలిచిన డుప్లెసిస్.. సమవుజ్జీల పోరులో గెలుపెవరిదో?

ABN, First Publish Date - 2023-04-17T19:20:46+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో సమవుజ్జీల పోరుకు టాస్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)పై టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో సమవుజ్జీల పోరుకు టాస్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)పై టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బౌలింగ్ ఎంచుకుంది. సొంత మైదానమైన ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నఈ మ్యాచ్‌లో గెలుపుపై డుప్లెసిస్ సేన ధీమాగా ఉంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై 23 పరుగులతో గెలిచిన బెంగళూరు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

ధోనీ సారథ్యంలోని చెన్నై మాత్రం రాజస్థాన్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిన పరాభవ భారంతో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఓటమిని మర్చిపోయి గెలుపు బాట పట్టాలని యోచిస్తోంది. బెంగళూరు జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, చెన్నై మాత్రం ఒక్క మార్పుతో ఆడుతోంది. గాయపడిన మగల స్థానంలో మతీసా పథిరన జట్టులోకి వచ్చాడు. చెన్నై, బెంగళూరు జట్లు రెండూ ఇప్పటి వరకు చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా తలా రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి.

Updated Date - 2023-04-17T19:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising