ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: మళ్లీ బాదేసిన గైక్వాడ్.. వరుసగా రెండో మ్యాచ్‌‌లోనూ..

ABN, First Publish Date - 2023-04-03T20:35:36+05:30

లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై: లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెలరేగి అర్ధ సెంచరీ బాదాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు పూర్తిచేశాడు. రుతురాజ్ దెబ్బకు చెన్నై స్కోరుబోర్డు పరుగులు తీసింది. దీనికి తోడు డెవోన్ కాన్వే కూడా బ్యాట్ ఝళిపించడంతో లక్నో బౌలర్లు బెంబేలెత్తారు. ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవి బిష్ణోయ్ బౌలింగులో గైక్వాడ్ అవుటయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లు పూర్తయ్యాయి. వికెట్ నష్టానికి చెన్నై 114 పరుగులు చేసింది.

గత మ్యాచ్‌లో సింగిల్ రన్‌కే పెవిలియన్ చేరిన కాన్వే ఈసారి మాత్రం జాగ్రత్తగా ఆడుతూ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బాది పడేస్తున్నాడు. కాగా, గైక్వాడ్ గత మ్యాచ్‌లోనూ వీర విహారం చేశాడు. 50 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసి 8 పరుగులు తేడాతో సెంచరీ కోల్పోయాడు. లేదంటే ఈ ఐపీఎల్‌లో అతడిదే తొలి సెంచరీ అయి ఉండేది.

Updated Date - 2023-04-03T20:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising