ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: శంకర్ మెరుపు ఇన్నింగ్స్.. మళ్లీ టాప్ ప్లేస్‌కి గుజరాత్!

ABN, First Publish Date - 2023-04-29T20:06:26+05:30

ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 7 వికెట్ల తేడాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ మళ్లీ టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. కేకేఆర్ నిర్దేశించిన 180 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. వృద్ధిమాన్ సాహా 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 20 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు.

35 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన గిల్ ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ కోల్పోయాడు. ఇక, విజయ్ శంకర్ (Vijay Shakar), డేవిడ్ మిల్లర్(David Miller) చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి కోల్‌కతా బౌలర్లను ఆటాడుకున్నారు. శంకర్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేయగా, మిల్లర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిపెట్టారు.

Updated Date - 2023-04-29T20:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising