ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: ఐపీఎల్-17 ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..?

ABN, First Publish Date - 2023-11-24T19:31:39+05:30

IPL 2024: వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు, బెట్టింగ్ రాయుళ్ల దృష్టి ఐపీఎల్ మీద పడింది. ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు, బెట్టింగ్ రాయుళ్ల దృష్టి ఐపీఎల్ మీద పడింది. డిసెంబర్ 19 నుంచి ఐపీఎల్ మినీ వేలం జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న అంశంపై క్రికెట్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ మార్చి 11న ముగియనుండగా.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు డిసెంబరులో జరిగే ఐపీఎల్ మినీ వేలంపై అన్ని జట్లు దృష్టి సారించాయి. ఐపీఎల్ పాలకమండలి నిబంధనల ప్రకారం ఈనెల 26లోగా రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేయాల్సి ఉంది.

ఇప్పటికే పలు జట్లు ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా ఆటగాళ్లను స్వాప్ చేసుకున్నాయి. రొమారియో షెపర్డ్‌ను (రూ.50 లక్షలు) లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ తీసుకోగా.. దేవదత్ పడిక్కల్‌ను (రూ.7.5 కోట్లు) రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తీసుకున్నాయి. అటు అవేష్ ఖాన్‌ను (రూ.10 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ట్రేడింగ్ చేసుకుంది. కాగా వచ్చే సీజన్ కోసం బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండని కారణంగా అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ వెల్లడించింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా, మనీష్ పాండేలను విడుదల చేయగా.. యష్ దయాళ్, దాసున్ షనాక, ఒడియన్ స్మిత్, ప్రదీప్ సాంగ్వాన్, ఉరివ్ పటేల్‌లను వేలంలోకి రిలీజ్ చేస్తున్న గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-24T19:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising