ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్ చేసిన బీసీసీఐ.. ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్ ఇదే..!!

ABN, First Publish Date - 2023-11-03T20:21:14+05:30

ఐపీఎల్ 17వ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాదికి సంబంధించిన లీగ్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనుంది.

భారత్‌లో జరిగే ఐపీఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు 16 సీజన్‌లు జరగ్గా.. వచ్చే ఏడాది జరిగే 17వ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాదికి సంబంధించిన లీగ్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ కూడా విధించింది. నవంబర్ 26లోగా ప్రతి ప్రాంఛైజీ రిటైన్ చేసుకుంటున్న ఆటగాళ్లు, వేలంలోకి విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను వెల్లడించాలని సూచించింది. దీంతో వన్డే ప్రపంచకప్ పూర్తయిన వెంటనే ఫ్రాంచైజీలు ఈ వివరాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

కాగా 2024 ఐపీఎల్ వేలంలో ప్రతి ఫ్రాంచైజీ పర్సు వాల్యూ పెరిగింది. రూ.100 కోట్ల పర్సు వాల్యూతో 10 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొననున్నాయి. గతంలో పర్సు వాల్యూ రూ.95 కోట్లు మాత్రమే ఉండేది. కానీ బీసీసీఐ వచ్చే ఏడాదికి సంబంధించిన ఐపీఎల్ కోసం పర్సు వాల్యూను మరో రూ.5 కోట్లు పెంచింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ దగ్గర అత్యధికంగా రూ.12.2 కోట్ల పర్స్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వద్ద రూ.6.55 కోట్ల పర్స్ ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద రూ.5 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీల వద్ద రూ.4.45 కోట్ల చొప్పున పర్స్ ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.3.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.3.35 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.1.75 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.1.65 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.1.5 కోట్ల చొప్పున పర్స్ ఉంది. అటు ఐపీఎల్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియా షెపర్డ్‌ను రూ.50 లక్షలు ఖర్చు చేసి ట్రేడింగ్ చేసుకుంది. వెస్టిండీస్‌కు చెందిన రొమారియో షెపర్డ్ తన ఐపీఎల్ కెరీర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 4 మ్యాచ్‌లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 4 మ్యాచ్‌లు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు.

Updated Date - 2023-11-03T20:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising