ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kane Willamson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ స్టార్.. 32 ఏళ్లలో ఇదే తొలిసారి..!!

ABN, First Publish Date - 2023-11-29T18:05:21+05:30

BAN Vs NZ: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో కేన్ మామ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా అతడు సెంచరీతో రాణించాడు. తన కెరీర్‌లో 29వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ ఫార్మాట్ ఆడి చాన్నాళ్లు అవుతోంది. 8 నెలల తర్వాత అతడు టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో కేన్ మామ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా అతడు సెంచరీతో రాణించాడు. తన కెరీర్‌లో 29వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. దీంతో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. మరోవైపు టెస్టుల్లో ఇది విలియమ్సన్‌కు హ్యాట్రిక్ సెంచరీ. ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ కేన్ మామ సెంచరీలు బాదాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సెంచరీ నమోదు చేయడంతో అతడు చరిత్ర సృష్టించాడు. గత 32 ఏళ్లలో న్యూజిలాండ్ తరఫున వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కోహ్లీ కంటే తక్కువ టెస్టుల్లో విలియమ్సన్ 29 సెంచరీల మార్క్ అందుకున్నాడు. కోహ్లీతో పోలిస్తే 16 టెస్టులు, 22 ఇన్నింగ్స్‌ల కంటే తక్కువగా కేన్ మామ 29వ సెంచరీ బాదాడు. అంతేకాకుండా అతడి యావరేజ్ 55 కంటే ఎక్కువగా నమోదైంది. ఇప్పటివరకు 111 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 165 ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు సాధించాడు. చివ‌ర‌గా 2023, జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. కాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా జట్టు 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. బంగ్లా స్కోరును దాటాలంటే కివీస్‌కు ఇంకా 44 రన్స్ కావాలి. క్రీజులో కెప్టెన్ సౌథీ (1), కైల్ జేమీసన్ (7) ఉన్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T18:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising