ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KL Rahul Viral Video: మూడో టెస్టుకు ముందు భార్యతో కలిసి ఆలయానికి కేఎల్ రాహుల్

ABN, First Publish Date - 2023-02-26T19:02:31+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉజ్జయిని: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరుగుల కోసం చెమటోడుస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన రాహుల్‌పై మాజీ క్రికెటర్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అతడి స్థానాన్ని యువ ఆటగాడు శుభమన్ గిల్‌తో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్ ఒక్కసారి కూడా 25 పరుగులు దాటలేకపోయాడు.

మార్చి 1 నుంచి ఇండోర్‌లో భారత్-ఆసీస్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ తన భార్య అతియా శెట్టి(Athiya Shetty)తో కలిసి ఆదివారం మధ్యప్రదేశ్ ఉజ్జయిని లోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని(Mahakaleshwar Temple) సందర్శించాడు. ఇద్దరూ కలిసి ఆలయంలో పూజలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది.

కాగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీని కోల్పోవడంపై రవిశాస్త్రి(Ravi Shastri) తాజాగా మాట్లాడుతూ.. తరచూ విఫలమవుతున్న రాహుల్ స్థానంలో శుభమన్ గిల్‌ను తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, భారత జట్టుకు స్వదేశంలో వైస్ కెప్టెన్ అవసరం లేదన్నాడు. రాహుల్ ఫామ్, అతడి మానసిక స్థితి గురించి కూడా జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలుసని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-02-26T19:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising