ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MS Dhoni: బాంబు పేల్చిన ధోనీ.. షాక్ నుంచి తేరుకోలేకపోతున్న అభిమానులు!

ABN, First Publish Date - 2023-04-22T16:52:25+05:30

కెప్టెన్‌గా భారత జట్టుకు ధోనీ(Dhoni) అందించిన విజయాలు చిరస్మరణీయం. అతడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కెప్టెన్‌గా భారత జట్టుకు ధోనీ(Dhoni) అందించిన విజయాలు చిరస్మరణీయం. అతడి సారథ్యంలోని భారత జట్టు(Team India) ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా ఎదిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో చెన్నైకి ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ నుంచి కూడా ధోనీ రిటైర్ కాబోతున్నాడంటూ చాలా సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ సీజనే ధోనీకి చివరిదంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై ధోనీ ఎప్పుడూ బహిరంగంగా స్పందించనప్పటికీ.. తాజాగా మాత్రం బాంబు పేల్చాడు.

శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. తన కెరియర్ చివరి దశలో ఉందని పేర్కొన్నాడు. ఇదే తనకు చివరి సీజన్ అని సంకేతాలిచ్చాడు. హైదరాబాద్‌పై విజయం సాధించిన అనంతరం డగౌట్ నుంచి బయటకు వచ్చిన ధోనీని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు.

తన వయసు పెరిగిందని, ఈ విషయం చెప్పడానికి తాను సిగ్గుపడబోనని చెప్పాడు. తన కెరియర్ చివరి దశకు చేరుకున్నట్టేనని అన్నాడు. ఏది ఏమైనప్పటికీ తాను చాలా సుదీర్ఘకాలం క్రికెట్ ఆడానని పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్‌(Sachin Tendulkar)లా 16 ఏళ్లకే కెరియర్‌ను మొదలుపెడితే ఆటను మరింతగా ఆస్వాదించవచ్చన్నాడు. రెండేళ్ల తర్వాత అభిమానులకు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లు చూసే అవకాశం లభించిందని అన్నాడు. ఇక్కడుండడం చాలా ఆనందంగా ఉందన్న ధోనీ.. అభిమానులు తనపై ప్రేమాభిమానాలు కురిపించారని అన్నాడు.

తన కెరియర్ చివరి దశలో ఉందని, ఇదే చివరి సీజన్ అంటూ ధోనీ ఇచ్చిన హింట్‌తో అభిమానులను షాక్‌కు గురిచేసింది. ధోనీని ఇక మైదానంలో చూడలేమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధోనీ మరికొన్ని సీజన్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగాలని కోరుతున్నారు.

Updated Date - 2023-04-22T16:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising