ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MS Dhoni: రాజస్థాన్ రాయల్స్‌పై చివరి బంతికి ధోనీ విన్నింగ్ షాట్ మిస్.. ఒక్కసారిగా తొమ్మిదేళ్లనాటి ధోనీ ట్వీట్ వైరల్ !.. కారణం ఇదే..

ABN, First Publish Date - 2023-04-13T16:57:07+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023)లో ఇటీవల జరుగుతున్న మ్యాచ్‌లు మజాను పంచుతున్నాయి. ప్రేక్షకుల్లో కావాల్సినంత ఉత్కం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023)లో ఇటీవల జరుగుతున్న మ్యాచ్‌లు మజాను పంచుతున్నాయి. ప్రేక్షకుల్లో కావాల్సినంత ఉత్కంఠ నింపుతున్నాయి. చివరి బంతి వరకు కొనసాగుతున్న మ్యాచుల్లో విజయం ఇరు జట్లను ఊరిస్తూ వస్తోంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)-చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా బోల్డంత ఉత్కంఠను రేకెత్తించింది. చివరికి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడంలో దిట్టగా ఖ్యాతికెక్కిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) ఈ మ్యాచ్‌లో ఆ పని చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా సీఎస్‌కే ఓటమి పాలైంది.

చెన్నై గెలవాలంటే చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరం. క్రీజులో ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు. సందీప్ శర్మ వేసిన తొలి బంతి వైడ్ అయింది. దీంతో ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాతి బంతి కూడా వైడ్ కావడంతో మరో పరుగు వచ్చింది. వైడ్ల రూపంలో రెండు పరుగులు కలిసొచ్చాయి. ఇప్పుడు లక్ష్యం ఆరు బంతులకు 19 పరుగులుగా మారింది. ఆ తర్వాతి బంతికి ధోనీ పరుగులేమీ చేయలేదు. రెండు, మూడో బంతులను ధోనీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో చెన్నై శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.

ఇక చెన్నై మూడు బంతుల్లో 7 పరుగులు చేస్తే విజయం సొంతమవుతుంది. అయితే, నాలుగో బంతికి ధోనీ, ఐదో బంతికి జడేజా సింగిళ్లు తీశారు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా, ధోనీ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. చివరి బంతిని స్టాండ్స్‌లోకి తరలించడం ధోనీకి అలవాటైన పనే కావడంతో విజయం నల్లేరు మీద నడకేనని భావించారు. అయితే, ఈసారి ధోనీ గురి తప్పింది. చివరి బంతికి ధోనీ సింగిల్ తీయడంతో చెన్నై ఓడింది. రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

రాజస్థాన్ చేతిలో చెన్నై ఓటమి తర్వాత ధోనీ 9 ఏళ్ల నాటి ట్వీట్ వైరల్ అయింది. ‘‘ఏ జట్టు గెలుస్తుందనేది కాదు.. నేనిక్కడ వినోదం అందించేందుకే ఉన్నాను’’ అని ఆ ట్వీట్‌లో ధోనీ పేర్కొన్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌ విషయంలో ధోనీ చేసిన ఈ ట్వీట్ చక్కగా సరిపోయిందంటూ అభిమానులు దీనిని రీ ట్వీట్ చేస్తున్నారు. చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును ధోనీ గెలిపించలేకపోయినప్పటికీ అభిమానులకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని పంచాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 17 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు.

Updated Date - 2023-04-13T16:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising