ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AFG VS NED: రాణించిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే నెదర్లాండ్స్ ఆలౌట్

ABN, First Publish Date - 2023-11-03T17:27:12+05:30

ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

వన్డే ప్రపంచకప్‌లో లక్నో వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఎంగెల్ బ్రెచ్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు రనౌట్లు నెదర్లాండ్స్ కొంప ముంచాయి. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్,ఎంగెల్ బ్రెచ్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీకి మూడు వికెట్లు దక్కాయి. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబుర్ రెహ్మాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

కాగా ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఆప్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ ఆరేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. ఆప్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలిచి మరో మూడింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగింట్లో ఓడి 4 పాయింట్లతో 8వ స్థానానికి పరిమితమైంది.

Updated Date - 2023-11-03T17:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising