ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arshdeep Singh: అర్షదీప్ సింగ్‌ను రోస్ట్ చేసేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

ABN, First Publish Date - 2023-05-04T18:53:34+05:30

పంజాబ్ సూపర్ కింగ్స్ (PBKS) పేసర్ అర్షదీప్ సింగ్‌ (Arshadeep Singh)ను నెటిజన్లు ఫ్రై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: పంజాబ్ సూపర్ కింగ్స్ (PBKS) పేసర్ అర్షదీప్ సింగ్‌ (Arshadeep Singh)ను నెటిజన్లు ఫ్రై చేసేసుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఆడేసుకుంటున్నారు. కారణం ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)తో బుధవారం మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో పరుగులు ధారాళంగా సమర్పించేసుకోవడమే. అర్షదీప్ బౌలింగును సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఉతికి ఆరేశారు. మొత్తం 3.5 ఓవర్లు వేసిన అర్షదీప్ ఒక్క వికెట్ మాత్రమే తీసుకుని 66 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. భారీ లక్ష్యం కావడంతో పంజాబ్ విజయంపై ధీమాగా ఉంది. ఆ తర్వాత ముంబై వికెట్లు నేల కూలుస్తూ ఒత్తిడి పెంచింది. ఒక దశలో ముంబై ఓటమి ఖాయమని అనిపించింది. అయితే, డెత్ ఓవర్లలో క్రమ శిక్షణతో బౌలింగ్ చేయాల్సిన అర్షదీప్ ఇబ్బడి ముబ్బడిగా పరుగులు సమర్పించేసుకున్నాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌‌ను అర్షదీప్ ఓడించాడంటూ ఫ్యాన్స్ ఫైరయ్యారు. ట్విట్టర్‌లో మీమ్స్, జోకులు పేలుస్తూ ఆడేసుకుంటున్నారు.

ముంబైతో మ్యాచ్‌లో అర్షదీప్ టీ20ల్లో ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. 23 బంతుల్లో 66 పరుగులు ఇచ్చుకున్న అర్షదీప్.. న్యూజిలాండ్ (Kiwis) బౌలర్ బెన్ వీలర్ ( Ben Wheeler) రికార్డును బద్దలుగొట్టాడు. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో వీలర్ 3.1 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడా రికార్డును అర్షదీప్ అధిగమించి చెత్త రికార్డును తనపై రాసుకున్నాడు.

Updated Date - 2023-05-04T18:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising