ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SMAT 2023: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్

ABN, First Publish Date - 2023-10-27T21:33:39+05:30

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రియాన్ పరాగ్ వరల్డ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో రియాన్‌కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించలేదు.

ఐపీఎల్‌‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు చెందిన యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 లీగ్‌లో అసోం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రియాన్ పరాగ్ తోపులకే సాధ్యం కాని సరికొత్త హిస్టరీని క్రియేట్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా వరల్డ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో రియాన్‌కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించలేదు. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో చెలరేగి ఆడాడు. బ్యాటింగ్‌లో 33 బంతుల్లో ఫోర్‌, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసిన రియాన్‌.. బౌలింగ్‌లో తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా 17 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు ఒక వికెట్‌ కూడా తీసుకుని తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

ఇది కూడా చదవండి: ODI World Cup: ఏ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి?

ఈ ఇన్నింగ్స్‌కు ముందు రియాన్ పరాగ్ వరుసగా 102 నాటౌట్‌, 95 (దియోధర్‌ ట్రోఫీ), 45, 61, 76 నాటౌట్‌, 53 నాటౌట్‌, 76, 72 పరుగులు చేశాడు. రియాన్ ప్రదర్శన ఇలాగే కొనసాగితే అతడు ఐపీఎల్‌ 2024 వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ వేలంలోకి రిలీజ్‌ చేయకపోతే.. ఆ జట్టులోనే మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అసోం టీమ్ 2 వికెట్ల తేడాతో కేరళను ఓడించింది. దీంతో ఈ టోర్నీలో కేరళ తొలి ఓటమి రుచి చూసింది. గ్రూప్‌-బిలో కేరళ 7 మ్యాచుల్లో 6 గెలిచి అగ్ర స్థానంలో ఉంది.

Updated Date - 2023-10-27T21:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising