ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: నోరు జారిన అశ్విన్‌కు భారీ జరిమానా!

ABN, First Publish Date - 2023-04-13T20:57:54+05:30

రాజస్థాన్ రాయల్స్(RR) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(Ravichandran Ashwin)కు మ్యాచ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్(RR) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(Ravichandran Ashwin)కు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడింది. చెన్నై సూపర్ కింగ్స్(CSK)-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినట్టు తేలడంతో ఈ జరిమానా విధించినట్టు బీసీసీఐ తెలిపింది. అశ్విన్ చేసిన తప్పేంటన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. అయితే, మ్యాచ్ అనంతరం ‘అంపైరింగ్‌పై కామెంట్స్’ చేసిందుకు గాను ఈ జరిమానా విధించినట్టు తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ ఛేజింగ్ సమయంలో మంచు కురవడంతో ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని తమకు తాముగా బంతిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అశ్విన్‌ను ఇది అయోమయానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో చెన్నైని రాయల్స్ మూడు పరుగుల తేడాతో ఓడించింది. చివరి ఓవర్‌కు 21 పరుగులు అవసరమైన వేళ క్రీజులో ఉన్న ధోనీ, రవీంద్ర జడేజా ఇద్దరూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. మంచు మితిమీరి కురుస్తోందని అంపైర్లు బంతిని మార్చడాన్ని తానెప్పుడూ చూడలేదని అశ్విన్ పేర్కొన్నాడు. ఇది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తనను కొంత నిరుత్సాహానికి గురి చేశాయని మ్యాచ్ అనంతరం అశ్విన్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ జట్టుగా బంతిని మార్చమని తాము అడగ లేదని, కానీ అంపైర్లు తమకు తామే బంతిని మార్చారని అన్నాడు. తాను ఈ విషయాన్ని అంపైర్‌ను అడిగితే తాము మార్చొచ్చని అన్నారని పేర్కొన్నాడు. కాబట్టి మంచు కురిసిన ప్రతిసారీ ఈ ఐపీఎల్‌లో వారు బంతిని మారుస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యంగ్యంగా పేర్కొన్నాడు.

Updated Date - 2023-04-13T20:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising