ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kane Williamson: రాస్ టేలర్ రికార్డును బద్దలుగొట్టిన విలియమ్సన్.. టేలర్ రియాక్షన్ ఇదీ!

ABN, First Publish Date - 2023-02-27T21:42:30+05:30

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సరికొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సరికొత్త రికార్డు సృష్టించాడు. జట్టు మాజీ కెప్టెన్ రాస్ టేలర్(Ross Taylor) రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన కివీస్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 25 పరుగుల వ్యక్తిగత స్కోరుతో నాలుగో రోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విలియమ్సన్(Kane Williamson) ఫోర్ కొట్టి రాస్ టేలర్ (7,683) రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన కివీస్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

తన రికార్డును విలియమ్సన్ అధిగమించడంపై టేలర్(Ross Taylor) స్పందించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో అతడి కృషి, అంకితభావానికి ఈ రికార్డు నిదర్శనమని కొనియాడాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన కివీస్ క్రికెటర్‌గా రికార్డు సాధించినందుకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. టెస్టు క్రికెట్‌‌లో విలియమ్సన్ కృషి, పట్టుదలకు అది నిదర్శనమన్నాడు. మరిన్ని రికార్డులు అందుకోవాలని ఆకాంక్షించాడు.

కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసిన విలియమ్సన్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (132 పరుగులు) సాధించాడు. లాథమ్ 83, కాన్వే 61, డరిల్ మిచెల్ 54, టామ్ బ్లండెల్ 90 పరుగులు చేశారు. ఫలితంగా న్యూజిలాండ్ 483 పరుగులు చేసింది. అనంతరం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఈ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఇంకా 210 పరుగులు కావాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

Updated Date - 2023-02-27T21:42:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising