ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shakib Al Hasan: మరోమారు రెచ్చిపోయిన షకీబల్ హసన్.. అంపైర్‌ పైకి దూసుకెళ్లి..

ABN, First Publish Date - 2023-01-08T21:21:07+05:30

బంగ్లాదేశ్(Bangladesh) వెటరన్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్(Shakib Al Hasan) మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh) వెటరన్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్(Shakib Al Hasan) మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు. నిజానికి షకీబల్‌కు వివాదాలు కొత్త కాదు. వికెట్లు విసిరికొట్టడం, సహనం కోల్పోయి అంపైర్లపైకి దూసుకెళ్లడం అతడికి మామూలే. మరీ ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో అయితే మరింతగా రెచ్చిపోతుంటాడు. తాజాగా, మరోమారు అలాగే ప్రవర్తించాడు. వైడ్ బాల్ విషయంలో లెగ్ అంపైర్‌పైకి దూసుకెళ్లి గొడవకు దిగాడు. అంపైర్‌పై షకీబల్ అరుస్తున్న వీడియో సోషల్ మీడియా(Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది.

గతంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ (BPL)పై బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనను కనుక బీపీఎల్ సీఈవోగా నియమిస్తే రెండే నెలల్లో వ్యవస్థను చక్కదిద్దుతానని వ్యాఖ్యానించాడు. తాజాగా జరుగుతున్న బీపీఎల్ మ్యాచ్‌లో అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. బౌలర్ సంధించిన ఓ బౌన్సర్ షకీబ్‌పై నుంచి వెళ్లింది. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించకపోవడంతో షకీబల్ సహనం కోల్పోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా లెగ్ అంపైర్ వైపు నడుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది వైడ్ కాదని, ఆ ఓవర్‌లో అదే తొలి బౌన్సర్ అని అంపైర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అతడి కోపం చల్లారలేదు. క్రీజులోకి వచ్చే వరకు నోటికి పని చెబుతూనే ఉన్నాడు.

2021 ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL)లోనూ షకీబ్ ఇలాగే ప్రవర్తించాడు. అంపైర్ నిర్ణయంపై ఆగ్రహంతో ఊగిపోయిన షకీబల్ స్టంప్స్‌ను ఊడబెరికి విసిరికొట్టాడు. ఆ తర్వాత తన ప్రవర్తనపై క్షమాపణలు చెప్పాడు. కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమయ్యానని, మ్యాచ్‌ను పాడుచేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ నిర్వాహకులు, ఇంట్లో ఉండి మ్యాచ్ చూస్తున్న అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అనుభవం ఉన్న తనలాంటి ఆటగాడు ఇలా ప్రవర్తించడం సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాగా, బీపీఎల్ తాజా మ్యాచ్ విషయానికి వస్తే షకీబల్ 67 పరుగులు చేశాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్చ్యూన్ బరిషాల్ జట్టు సిల్హెట్ స్ట్రైకర్స్ చేతిలో ఓడిపోయింది.

Updated Date - 2023-01-08T21:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising