ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Sri Lanka: భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్న శ్రీలంక కెప్టెన్.. భారత్ లక్ష్యం ఎంతంటే?

ABN, First Publish Date - 2023-01-05T20:54:20+05:30

భారత్‌తో ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక చెలరేగింది. నిర్ణీత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: భారత్‌తో ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(Kusal Mendis) 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేయగా, చివర్లో కెప్టెన్ దాసున్ షనక(Dasun Shanaka) వీరవిహారం చేశాడు. భారత బౌలర్లను యథేచ్ఛగా ఆడుకున్నాడు. సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అతడి దెబ్బకు స్కోరు బోర్డు అలుపు లేకుండా పరుగు తీసి 200 దాటింది. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక 35 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేయగా, చరిత్ అసలంక కూడా బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 4 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్ 2, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీశాడు.

Updated Date - 2023-01-05T20:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising