ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shubman Gill: వరల్డ్ రికార్డ్ సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఆ మైలురాయి అందుకున్న తొలి ఆటగాడు

ABN, First Publish Date - 2023-10-22T20:25:30+05:30

భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకొని చరిత్రపుటలకెక్కాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా..

భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకొని చరిత్రపుటలకెక్కాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా.. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 వ్యక్తిగత పరుగుల వద్ద అతడు ఈ రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ సౌతాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. 40 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులను వేగంగా చేసి, ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. 2011 జనవరి 11వ తేదీన సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత శుభ్‌మన్ ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగుల మార్క్‌ని దాటేసి.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఏడో ఓవర్‌లో మూడో బంతికి ఫోర్ బాది, రెండు వేల పరుగుల మైల్‌స్టోన్‌ని అందుకున్నాడు.


ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ కాస్త తడబడ్డాడు. క్రీజులో ఎక్కువసేపు నిలకడగా రాణించలేకపోయాడు. రోహిత్ క్రీజులో ఉన్నంతసేపూ గిల్ మంచి ఫామ్‌లోనే కనిపించాడు. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ.. 26 పరుగులు చేసి అతడు ఔట్ అయ్యాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో డేరిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అటు.. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ సైతం ఇదే మ్యాచ్‌లో ఓ రికార్డ్ సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన మొదటి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. తాజాగా న్యూజీలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ ఐదు వికెట్లు తీసి, కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. షమీ తర్వాత కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ తలా ఒక్కసారి ఐదు వికెట్ల ఘనతను సాధించడం జరిగింది.

Updated Date - 2023-10-22T20:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising