ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్.. పాండ్యా స్థానంలో గిల్‌కు బాధ్యతలు?

ABN, First Publish Date - 2023-11-25T15:58:33+05:30

IPL 2024: 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు సీజన్‌లలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించగా.. అతడు వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌‌గా కనిపించే అవకాశాలున్నాయి.

ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లోనూ మంచి ప్రదర్శన చేసి రన్నరప్స్‌గా నిలిచింది. అయితే 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు సీజన్‌లలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించగా.. అతడు వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌‌గా కనిపించబోతున్నాడు. జట్టులో కేన్ విలియమ్సన్ ఉన్నా భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేన్ మామ కంటే గిల్‌కే సారథ్య బాధ్యతలను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరి కెప్టెన్సీ అతడికి భారంగా ఉంటుందా లేదా పాండ్యా తరహాలో అతడు రాణిస్తాడా అన్న విషయం వచ్చే సీజన్‌లోనే స్పష్టం కానుంది.

ఒకవేళ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ తీసుకునేందుకు నిరాకరిస్తే మరో రెండు, మూడు ఆప్షన్‌లు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఉన్నాయి. డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్‌లకు కూడా కెప్టెన్‌లుగా రాణించే సత్తా ఉంది. గత రెండు సీజన్‌లలో గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో డేవిడ్ మిల్లర్ ప్రధాన పాత్ర పోషించాడు. అతడికి ఎంతో అనుభవం కూడా ఉంది. అయితే సీజన్ మొత్తం అందుబాటులో ఉంటానని అతడు హామీ ఇస్తే గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మిల్లర్‌ను కెప్టెన్‌గా పరిగణించే అవకాశాలు లేకపోలేదు. ఇక టీ20లలో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటే సామర్థ్యం ఉన్న రషీద్ ఖాన్ కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అతడికి కూడా ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. ఇతర ఆటగాళ్లను నడిపించే సత్తా కూడా ఉంది. విజయ్ శంకర్ రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టును అద్భుతంగా నడిపించాడు. ఇతర ఆటగాళ్లు ఓవర్సీస్ ప్లేయర్లు కావడంతో ఇండియన్ కెప్టెన్ కావాలని గుజరాత్ ఫ్రాంచైజీ భావిస్తే విజయ్ శంకర్ కూడా కెప్టెన్‌గా గుడ్ ఛాయిస్ కానున్నాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T16:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising