ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

ABN, First Publish Date - 2023-11-01T21:31:39+05:30

వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.

వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మినహాయిస్తే సఫారీలు ప్రతి మ్యాచ్‌లోనూ సాధికారికంగానే విజయం సాధించారు. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది. దీంతో టీమిండియా రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. దీంతో 190 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (60) రాణించకపోయి ఉంటే ఆ జట్టు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. అతడు 50 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 3 వికెట్లు తీయగా.. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. జూనియర్ స్టెయిన్ గెరాల్డ్ కోయిట్జె 2 వికెట్లు పడగొట్టాడు. తాజా ఓటమితో నెట్ రన్‌రేట్ తగ్గడంతో న్యూజిలాండ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. కాగా న్యూజిలాండ్ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

Updated Date - 2023-11-01T21:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising