ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: సింహాచలం అప్పన్నను దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు

ABN, First Publish Date - 2023-11-23T16:39:28+05:30

IND Vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 విశాఖ వేదికగా ఈరోజు రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు తొలి టీ20 గెలవాలని ఆకాంక్షిస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం స్వామి వారి సన్నిధిలోని వచ్చిన టీమిండియా క్రికెటర్లకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతోనే టీమిండియా సొంతగడ్డపై ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. తొలి టీ20 విశాఖ వేదికగా ఈరోజు రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు తొలి టీ20 గెలవాలని ఆకాంక్షిస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం స్వామి వారి సన్నిధిలోని వచ్చిన టీమిండియా క్రికెటర్లకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. అనంతరం వేద పండితులు, ఆలయ అర్చకులు క్రికెటర్లకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. సింహాచలం స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ సహా టీమిండియా స్టాఫ్ ఉన్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

కాగా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖలో, రెండో మ్యాచ్ తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ గౌహతిలో, నాలుగో మ్యాచ్ రాయపూర్‌లో, ఐదో మ్యాచ్ బెంగళూరులో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ వంటి క్రికెటర్లు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. చివరి రెండు టీ20లకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులోకి రానున్నాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే విశాఖలో తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌కు ముందు వర్షం కురిసినా మ్యాచ్ సమయంలో వర్షం పడదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-23T16:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising